కామారెడ్డి నుంచి కేసీఆర్ ని తరిమికొడుదామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్, గజ్వేల్ భూములు అమ్ముకున్న కేసీఆర్.. ఇప్పుడు కామారెడ్డి భూములను అమ్ముకునేందుకు ఇక్కడ పోటీ చేస్తున్నారని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తామని షబ్బీర్ అలీ మండిపడ్డారు. కామారెడ్డి, గజ్వేల్ లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలే ఓటు ద్వారా సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్తారన్నారు. కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. బీఆర్ఎస్ ను బొందపెడతామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ హెచ్చరించారు. నేను కామారెడ్డి గడ్డ మీద పుట్టినా.. ఇక్కడే చస్తా.. నన్ను ఆశీర్వదించండని మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ ఆకాంక్షించారు.
తెలంగాణ కేసీఆర్ రింగ్ రోడ్ల పేరుతో పేదల భూములన్నీ లాక్కుంటున్నారని.. ఆ భూములన్నీ తన బంధువులకు మార్పిడి చేస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. నాసిరకం డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించి ప్రజల ప్రాణాలతో అడుకుంటున్నారని మండిపడ్డారు. కవితను జైలుకు పంపే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల అవినీతి చేసిందని ఆరోపించారు. తండ్రి కేసీఆర్ లిక్కర్ షాపులు పెడితే.. కూతురు కవిత ఆ లిక్కర్ దందాకి రాణి అయిందని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్మును ప్రజలకు పంచుతామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా, వైద్యం అనేవి ఓ ములనపడ్డాయని విమర్శించారు.