సనాతన ధర్మానికి హాని కలిగితే ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకునేది ప్రసక్తే లేదని, ప్రాణాలు ఇచ్చేందుకైనా తాను సిద్ధమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. ఇవాళ (సెప్టెంబర్ 28) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు సనాతన ధర్మం పేరుతో డ్రామాలాడుతున్నారన్నారు. భార్యకు విడాకులు ఇవ్వమని ఏ సనాతన ధర్మంలో ఉంది..? భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇంకొకరితో కలిసి ఉండమని ఏ ధర్మంలో ఉందని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు.
ALSO READ | నేనడుగుతున్నా.. బొట్టు పెట్టుకుని టోపీ లేకుండా నమాజ్ చేయనిస్తారా..?
తాను చేగువేరా ఆదర్శాలకు అనుగుణంగా పని చేస్తామని పవన్ కల్యాణ్ గతంలో చెప్పాడని.. మరీ ఇప్పుడు చేగువేరా ఆదర్శరాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు ఎక్కడికిపోయాయని నిలదీశారు. గతంలో తాను బాప్టిజం తీసుకున్నా.. మా ఆవిడ క్రిస్టియన్.. పిల్లలు ఆర్ధ్రోస్ క్రిస్టియన్స్ అన్నారు కదా.. ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో ఉన్నాయో చెప్పాలని పవన్ కల్యాణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయంలో సనాతన ధర్మంపై దాడి జరిగిందని ఆరోపించారు. సనాతన ధర్మంపై దాడి జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు.