- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలో అణచివేతలు, కూల్చివేతలు తప్ప ఏమీ లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ నేతలు 10 నెలల్లోనే ఆగం చేశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన చూసి భూమి కూడా కంపిస్తోందన్నారు.
బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల తరపున బీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తుంటే కొత్త కొత్త కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.ఈ ప్రయత్నంలో కేసీఆర్ ను కూడా అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గన్ మెన్లు లేకుండా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటించే పరిస్థితి లేదన్నారు.