ఆగస్టు 10న బీసీ సత్యాగ్రహ దీక్ష: శ్రీనివాస్ గౌడ్

ఆగస్టు 10న బీసీ సత్యాగ్రహ దీక్ష: శ్రీనివాస్ గౌడ్

ఖైరతాబాద్, వెలుగు: కులగణన చేపట్టి, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. శనివారం జనసభ, వివిధ కుల సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్​క్లబ్​లో సమావేశం జరిగింది. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ తో కలిసి శ్రీనివాస్​ గౌడ్ మాట్లాడారు. ఈ నెల 10న ఇందిరా పార్కు వద్ద బీసీ సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 దీక్ష పోస్టర్​ను ఆవిష్కరించారు. బీసీలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వరులు, సోషల్​ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు పిడికిలి రాజు, టి.జర్నలిస్టు ఫోరం ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, అడ్వకేట్​జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.గోవర్ధన్ పాల్గన్నారు.