తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ తెలుగు ప్రజలను ఆంధ్రా తెలంగాణ వాసులుగా విభజిస్తొందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎక్కడ ఆంధ్రా తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు లేవన్నారు. తెలంగాణలో ఇప్పటికీ వ్యాపారాలు, ధనికులు ఆంధ్రావాసులేనని చెప్పారు.
టీటీడీలో తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు శ్రీనివాస్ గౌడ్. తాము టీటీడీని గొప్ప దేవాలయంగా భావిస్తామన్నారు. ఆ సంస్థ ఆస్తులను కాపాడేందుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం జోక్యంతో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తాయన్నారు. తెలంగాణకు చెందిన వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమిస్తే సరిపోదు వారికి నిర్ణయాధికారం ఇవ్వాలని సూచించారు.
ALSO READ : కలియుగ దైవం : మహా కుంభమేళాలో.. తిరుమల వెంకన్న నమూనా ఆలయం
తిరుమలలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు చెల్లడం లేదని కొన్ని రోజులుగా విమర్శలు వస్తున్నాయి. దీనిపై తెలంగాణ అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. ప్రతిపక్షాలు దీనిపై ప్రశ్నించగా..ఈ విషయంపై త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడుతామని మంత్రి పొన్నం బదులిచ్చారు.