రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : సుదర్శన్​ రెడ్డి

  •    మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి

సిరికొండ, వెలుగు : రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్​ రెడ్డి ఆరోపించారు. మండలంలోని గోప్యా నాయక్, వర్జన్ తండాలో గిరిజనుల సంప్రదాయ తీజ్​పండగలో ఆయన పాల్గొన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులు గతంలో కాంగ్రెస్​పార్టీ హయాంలో 80 శాతం పూర్తయ్యాయన్నారు. రూ.200 కోట్లు ఖర్చు చేస్తే వేల ఎకరాలకు సాగు నీరందేదన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం పైపులైన్​పేరుతో కమీషన్లకు ఆశించి ఇప్పటివరకు పనులు పూర్తిచేయలేదన్నారు. కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వైస్​ప్రెసిడెంట్​ తాహెర్​బీన్​హందాన్,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, అరికెల నర్సారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.