దుబ్బతండాలో గడపగడపకు కాంగ్రెస్ : సుదర్శన్​రెడ్డి

ఎడపల్లి, వెలుగు: బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాంగ్రెస్​ఎస్టీ సెల్​ఆధ్వర్యంలో మండలంలోని దుబ్బతండాలో ఇంటింటికీ కాంగ్రెస్​కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్​రెడ్డి తండాలోని ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీ పథకాలను వివరించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో నిత్యవసరాల ధరలు బాగా పెరిగాయని, దీంతో మధ్యతరగతి కుంటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15 వేల ఆర్థిక సాయం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, ఎస్సీ సెల్​ప్రెసిడెంట్ లింగం, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ బిల్లా రామ్​మోహన్​ పాల్గొన్నారు.