- హైకోర్టులో హరీశ్‌రావు క్వాష్ పిటిషన్
హైదరాబాద్, వెలుగు: పంజాగుట్ట పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పీఎస్‌లో తనపై ఫిర్యాదు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గాదగోని చక్రధర్ గౌడ్‌ను ప్రతివాదులుగా చేర్చారు.
ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరపనున్నారు. చక్రధర్ గౌడ్ ఫోన్లను ట్యాపింగ్ చేయించానంటూ తనతోపాటు, రాధా కిషన్ రావు, ఇతరులపై చేసిన ఫిర్యాదును ప్రాథమిక విచారణ చేయకుండానే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.