- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వండి
- ఎస్సీ వర్గకరణలో అయోమయాన్ని తొలగించండి
- మాజీ మంత్రి తలసాని
హైదరాబాద్: ప్రభుత్వం కులగణనను రీ సర్వే చేయాలని, రెండోసారి సర్వే చేస్తే ప్రజల్లో ఎలాంటి అయోమయం ఉండదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.
ఇవాళ సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతో తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పులతడకగాఉందన్నారు.
ALSO READ | స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యం.. సీఎల్పీ దిశానిర్ధేశం
సర్వే లెక్కలలో ఎలాంటి స్పష్టత లేదన్నారు.ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు.‘2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కంటే 2024 లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే లో 62 లక్షల మంది జనాభా తగ్గింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికల లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్న అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అని తలసాని అన్నారు.