ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే సమగ్రంగా లేదని..100 శాతం చేయాలని..మళ్లీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. హైదరాబాద్ సిటీలో 30 శాతం కూడా సర్వే జరగలేదని.. 57 ప్రశ్నలతో జనం భయపడ్డారని.. చాలా మంది సర్వేకు వివరాలు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ సిటీలో 30 శాతం కూడా సర్వే జరగలేదని.. ఆ సమాచారం నా దగ్గర ఉందన్నారు మాజీ మంత్రి తలసాని.
100 శాతం సర్వే చేసినప్పుడే విలువ ఉంటుందని.. అలా కాకుండా 96 శాతం సర్వే అంటే.. దీనికి భవిష్యత్ లో చాలా ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు తలసాని. కుల గణన సర్వేను చాలా సింపుల్ గా చేయాల్సిన అవసరం ఉందని.. కులం, ప్రాంతం, కుటుంబ వివరాలు వంటి కనీస సమాచారంతో సర్వే చేసినట్లయితే పూర్తి వివరాలు వస్తాయన్నారు తలసాని. అలా కాకుండా 57 అంశాలను చేర్చటం ద్వారా చాలా మంది వివరాలు చెప్పటానికి ముందుకు రాలేదని.. కుల గణన సర్వే మళ్లీ చేయాలని డిమాండ్ చేశారు తలసాని.
ALSO READ | కుల గణనతో కొత్త శకం మొదలైంది : మంత్రి పొన్నం ప్రభాకర్
2011 జనాభా లెక్కలకు.. కుల గణనలోని లెక్కలకు.. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న ఓటర్ల మధ్య చాలా తేడా ఉందని.. దీనిని పరిశీలించాలంటూ సభ దృష్టికి తెచ్చారాయన. బీసీ జనాభా తగ్గినట్లు ప్రచారం జరుగుతుందని.. ఈ విషయంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. కుల గణన సర్వేకు చట్టబద్దత ఇచ్చి.. అందుకు తగ్గట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో 45 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా చూడాలన్నారు. పార్టీల ఇష్టానుసారంగా కాకుండా.. చట్టబద్దతతో రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా చూడాలన్నారు మాజీ మంత్రి తలసాని.