రూ. 700 కోట్ల స్కామ్లో మాజీ మంత్రి తలసాని ఓఎస్‌‌‌‌డీ

రూ. 700 కోట్ల స్కామ్లో మాజీ మంత్రి తలసాని ఓఎస్‌‌‌‌డీ

గత బీఆర్ఎస్​ సర్కారు హయాంలో అమలుచేసిన గొర్రెల పంపిణీ స్కీమ్​లో భారీ కుంభకోణం బయటపడింది. ఈ స్కీమ్​లో రూ. 700 కోట్లు దారిమళ్లినట్టు ఏసీబీ అధికారులు తాజాగా గుర్తించారు. ఈ కేసులో  రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈవో, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్‌‌ రాంచందర్‌‌, అప్పటి పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌‌యాదవ్‌‌ ఓఎస్డీ గుండమరాజు కల్యాణ్‌‌కుమార్‌‌ను శుక్రవారం అరెస్ట్‌‌ చేశారు. 

మాజీ ఎండీ, తలసాని ఓఎస్‌‌‌‌డీ నిందితులే

ప్రభుత్వ నిధులను దారి మళ్లించడంలో సహకరించిన మాజీ ఎండీ సబావత్‌‌‌‌ రాంచందర్‌‌‌‌ను ఏ-9గా, తలసాని మాజీ ఓఎస్‌‌‌‌డీ కల్యాణ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ను 10వ నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే అరెస్ట్‌‌‌‌ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వీరిద్దరి పాత్రపై దర్యాప్తు చేశారు. స్కీమ్‌‌‌‌లో అవకతవకలకు బాధ్యులుగా గుర్తించారు. ప్రైవేట్​ వ్యక్తులతో కుమ్మక్కై గొర్రెల సేకరణ ప్రక్రియను ప్రైవేటు వ్యక్తులు, బ్రోకర్లకు అప్పగించినట్టు తేల్చారు. గొర్రెల కొనుగోలు పేరిట ప్రభుత్వ సొమ్ము ప్రైవేట్​వ్యక్తులకు చేరేలా చేశారని ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌‌‌‌ రైతులకు ఇవ్వాల్సిన  నిధులు కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి దారి మళ్లించినట్టు ఆధారాలు సేకరించారు.