బరితెగింపు..విచ్చలవిడితనం..ఇదే పువ్వాడ పాలన

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీ మంత్రి తుమ్మల చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారాయి. తాను మంత్రిగా ఉన్నప్పుడు పువ్వాడ ఈ స్థాయిలో అక్రమాలకు పెట్రేగిపోలేదని... అధికారులు తన ఆధీనంలో ఉండే వారు కాబట్టి అన్యాయానికి తావిచ్చేవారు కాదన్నారు. మంత్రి పువ్వాడ పాలించిన 4 సంవత్సరాల 10 నెలల్లో విచ్చలవిడితనంగా, బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని ఆరోపించారు.

ఈ రోజుల్లో కూడా ఇలాంటి పాలన సాగిస్తున్నారంటే మనందరికి సిగ్గు చేటని తుమ్మల మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపు రాజకీయాలను నిజాం టైంలో కూడా చూడలేదని తుమ్మల విమర్శించారు. 

Also Read :- హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఖమ్మంలో బందిపోట్లను తరిమికొట్టాలనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాని చెప్పారు. ఖమ్మంలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని సోనియా , రాహుల్ లకు చెప్పి ఖమ్మంలో పోటి చేసేందుకు సిద్దపడ్డాని వివరించారు. చిన్నతనం నుంచి ఎదురొడ్డి పోరాడిన తత్వం తనదని వ్యాఖ్యానించారు. అప్రజాస్వామిక పద్దతులో కానీ, అదిరిచ్చి, బెదిరించి ప్రజలను మభ్య పెట్టాలని కానీ లేదా భయ పెట్టాలని భావించలేదని తుమ్మల చెప్పారు.