ఖమ్మంలో అరాచక పాలన : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అరాచక పాలన సాగుతోందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కమ్మ జన సంఘం జిల్లా అధ్యక్షుడు, స్తంభాద్రి బ్యాంక్​ చైర్మన్​ ఎర్నేని రామారావు శనివారం తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అంతకుముందు నగరంలోని ప్రముఖులను కలిసి మద్దతు కోరారు. 

ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అరాచక పాలన తప్పించేందుకు తనకు మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్​, బాలసాని లక్ష్మీనారాయణ, తుంబూరు దయాకర్​ రెడ్డి, కార్పొరేటర్ మురళి, చావా నారాయణరావు, నరేందర్​ తదితరులు పాల్గొన్నారు.