కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పథకాలు ప్రారంభించేది రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసమేనని తుమ్మల ఆరోపించారు. భారత దేశం అభివృద్ధి చెందే దేశంగా తీర్చిదిద్దింది.. కేవలం కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. రాష్ట్రంలో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేసే బాధ్యతను పాలేరు, ఖమ్మం జిల్లా ప్రజలు మళ్లీ నాకు ఇవ్వాలని తమ్ముల కోరారు.
తాను ఎక్కడ ఉన్న పార్టీ కోసం పనిచేస్తా.. ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజల బాధలు తెలియని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారని... ప్రజలు బాధలు తీర్చే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామంలో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలను చేశారు.