ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం :మాజీ మంత్రి వేణుగోపాలా చారి

నేరడిగొండ, వెలుగు : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి వేణుగోపాలా చారి అన్నారు. నేరడిగొండ మండలంలోని కుంటాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బానోత్ వసంత్ రావుతోపాటు పలువురు శుక్రవారం కాంగ్రెస్​లో చేరారు. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వేణుగోపాలా చారి పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించి మాట్లాడారు.

ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తోందని, దీన్ని ఓర్వలేని ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు వివిధ పార్టీల నేతలు ఆకర్షితులై కాంగ్రెస్​లో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆడే వసంతరావు, జనార్ధన్, సుభాష్ పాల్గొన్నారు.