మోదీ బహిరంగ సభను విజయవంతం చేయండి : విజయ రామారావు

నిజామాబాద్, వెలుగు: ఈ నెల 3 న నిజామాబాద్​లో జరిగే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి విజయ రామారావు​కోరారు. శనివారం జిల్లాలోని పలు మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, కార్యక్రమ విజయవంతానికి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సిటీలోని వినయక్ నగర్, ఖిల్లా రామ్​మందిర్,  పగడాల దుబ్బ ప్రాంతాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తూ, పార్టీని బలోపేతం చేయాలన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్​కర్ లక్ష్మీనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ పంచరెడ్డి లింగం, జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.