
బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు నిధుల ఊసేలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. నిరుద్యోగులను కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. పెన్షన్ , తులం గోల్డ్ పథకాల ఊసేలేదన్నారు. చేనేతలకు అరకొర నిధులు కేటాయించారని చెప్పారు. నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్.
హైదరాబాద్ మహానగరం అధ్వానంగా మారిందని ఫైర్ అయ్యారు కేటీఆర్. 42 ఫ్లైఓవర్లలో 16 ఫ్లై ఓవర్లు తాము పూర్తి చేశాం..మిగిలిన 6 కూడా పూర్తి చేయలేదన్నారు. కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ ప్రమాదమని గతంలోనే చెప్పామన్నారు.
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కాదు ట్రిలియన్ డాలర్ల అప్పు చేస్తారని సెటైర్ వేశారు కేటీఆర్. ఈ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 60 వేల కోట్ల అప్పు చేసిందన్నారు. పేదల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు.. ఇది ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అని ఆరోపించారు కేటీఆర్. కాంగ్రెస్ వాళ్ల ప్రాధాన్యత వ్యవసాయం కాదు,ఢిల్లీకి మూటలు పంపడమే ప్రాధాన్యత అని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ నియామక పత్రాలు ఇచ్చిందని ఫైర్ అయ్యారు కేటీఆర్.
ALSO READ | బడ్జెట్ అరచేతిలో వైకుంఠం..పేజీలు పెరిగాయ్ కానీ..సంక్షేమం పెరగలేదు: హరీశ్ రావు
ప్రభుత్వం చేతగాని తనం వల్ల ఆదాయం పడిపోయిందన్నారు కేటీఆర్. రంకెలు వేయడం కాదు అంకెలు ఎందుకు తారుమారయ్యాయో చెప్పాలన్నారు. అంచనాలు ఎందుకు అందుకోలేదో చెప్పాలన్నారు. రేవంత్ చేతగాని తనానికి ఈ బడ్జెట్ నిదర్శనమని అన్నారు. తొండ ముదిరితే ఊసరవెళ్లి..ఊసరవెళ్లి ముదిరితే రేవంత్ అని ఫైర్ అయ్యారు కేటీఆర్.