24 ఏళ్లకే తల్లినయ్యానన్నారు.. సుస్మితా సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

24 ఏళ్లకే తల్లినయ్యానన్నారు.. సుస్మితా సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్(Sushmitha sen)​ ట్రాన్స్​జెండర్​గా చేసిన తాలి అదరగొడుతోంది. ఈ  రోల్​తో ఈ హీరోయిన్​ మరోసారి తానేంటో నిరూపించుకుంది. ఫామ్​లో ఉన్నప్పుడే సినిమాలకు దూరమవ్వడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది. 

‘అక్షయ్​ కుమార్​(Akshay kumar), కరీనా కపూర్(Kareena kapoor)​తో కలిసి ఓ మల్టీస్టారర్​ చేస్తున్న టైంలో నా జీవితంలో అతిపెద్ద కుదుపు వచ్చింది. నా కూతురు రీనీ(Reeni)ని ఆస్పత్రిలో చేర్పించారని కండీషన్​ సీరియస్​ అని ఫోన్​ వచ్చింది. విదేశాల్లో షూటింగ్​లో ఉన్న నేను సినిమాను మధ్యలో ఆపేసి వచ్చేశాను. ఆ క్షణమే నాకు తెలుసు నా కెరీర్​ ఇక్కడితో ముగిసిందని. నాకు కెరీర్​పై సీరియస్​నెస్​ లేదని, అందుకే 24 ఏళ్లకే తల్లినయ్యానని కామెంట్స్​ చేసేవారు. దీంతో నా పనిలో ఇంకా ఎక్కువ కష్టపడేదాన్ని.. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది’ అని సుస్మిత తెలిపింది. ఈ హీరోయిన్​ దత్తత తీసుకున్న ఇద్దరమ్మాయిల్లో రీనీ ఒకరు.