
ఎల్కతుర్తి, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో అప్పుల్లోకి నెట్టివేసిందని మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి విమర్శించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లె మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీలకు రెండేళ్ల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుం టున్నారన్నారు.
ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయకపోవడం, పేపర్ల లీకేజీలతో యువత రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుకినె సంతాజీ, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉసకోయిల రాఘవులు, సర్పంచులు చల్లా మల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఇంద్రసేనారెడ్డి, గ్రామ అధ్యక్షుడు అడ్డూరి రమేశ్ పాల్గొన్నారు.