నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష:ఆరేపల్లి మోహన్

రాష్ట్రానికి నిధులు విడుదల చేయడంలో కేంద్రం పక్షపాత దోరణి అవలంభిస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ఆరోపించారు. 8 ఏండ్లలో రూ.12 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు కేంద్రం  రుణాలు మాఫీ చేసిందని తెలిపారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను మిస్ యూజ్ చేస్తోందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న దళితబంధులాంటి పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

సిట్టింగ్ లకే మళ్లీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ.. తన సేవలను కూడా పార్టీ వాడుకుంటుందని భావిస్తున్నానని చెప్పారు.ఆరు నెలల ముందు టికెట్లు కేటాయిస్తారని..అప్పటిదాకా వేచి చూస్తానన్నారు. ఆ తర్వాత ఏదైనా ఉంటే  ఆలోచన చేస్తానని చెప్పారు.