మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త కన్నుమూత

గంగాధర, వెలుగు: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త బొడిగ గాలన్న (62) క్యాన్సర్​తో పోరాడుతూ శుక్రవారం కన్నుమూశారు. గాలన్నకు మూడేండ్లకు ముందు క్యాన్సర్​సోకిం ది. అప్పటినుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో కరీంనగర్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం చనిపోయారు. గాలన్న స్వగ్రామం సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి.

అంత్యక్రియలను ఆయన స్వగ్రామంలో శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గాలన్న భార్య శోభక్క గతంలో శంకరపట్నం జడ్పీటీసీగా, చొప్పదండి ఎమ్మెల్యేగా పని చేశారు. వీరికి ఒక కొడుకు, ఒక బిడ్డ ఉన్నారు. గాలన్న మృతి పై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​కుమార్ సంతాపం తెలిపారు. గాలన్న టీఆర్ఎస్​ఆవిర్భావం నుంచి ఉద్యమంలో పనిచేశారని, చిన్నతనం నుంచే పేదల సమస్యలపై పోరాటం చేయడంతో పాటు వామపక్ష పార్టీల్లో పని చేశారన్నారు. ఆయన  మృతి తీరని లోటన్నారు.