లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి : చాడ వెంకటరెడ్డి

లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి : చాడ వెంకటరెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, రాజకీయాలకతీతంగా పేదలకు పథకాలు అందజేయాలని కోరారు. కొన్ని చోట్ల అధికార పార్టీకి చెందిన వారికే పథకాలు అందిస్తున్నారని, అసలైన లబ్ధిదారులను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని  కోరారు.