
పుల్కల్, వెలుగు : సింగూర్ ప్రాజెక్ట్ లో నీళ్లు పుష్కలంగా ఉన్నా పంటలు ఎండిపోతున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల జైపాల్ రెడ్డితో కలిసి పుల్కల్ మండలంలోని ఉమ్లానాయక్ తండా, హన్మనాయక్ తండా, సింగూర్ కెనాల్ వెంట వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా క్రాంతికిరణ్మాట్లాడుతూ కెనాల్ సీసీ లైనింగ్ పనుల పేరుతో రైతుల పంటలకు నీరు విడుదల చేయకపోవడంతో ఎండిపోతున్నాయని తెలిపారు. వారం రోజుల్లో ప్రభుత్వం పునరాలోచన చేసి ఎండుతున్న పంటలకు నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, రైతులు ఉన్నారు.