మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌‌రెడ్డి అరెస్ట్‌‌

మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌‌రెడ్డి అరెస్ట్‌‌

మక్తల్, వెలుగు : మాగనూరు జడ్పీ హైస్కూల్‌‌లో ఫుడ్‌‌పాయిజన్‌‌ జరిగి స్టూడెంట్లు అస్వస్థతకు గురైన నేపథ్యంలో బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు ధర్నాకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు మాజీఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌‌రెడ్డిని ముందస్తుగా అరెస్ట్‌‌ చేశారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహగౌడ్, సీనియర్ నాయకుడు రాజుల ఆశిరెడ్డి, మక్తల్, మాగనూరు మండలాల్లోని పలువురు బీఆర్‌‌ఎస్‌‌ నేతలను ముందస్తుగా అరెస్ట్‌‌ చేశారు. చిట్టెం రామ్మోహన్‌‌రెడ్డిని మద్దూర్‌‌ పీఎస్‌‌కు తరలించగా, మార్కెట్‌‌ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్ , నాయకుడు రాజుల ఆశిరెడ్డిని నర్వ పోలీస్‌‌స్టేషన్‌‌కు తరలించారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా మాగనూరు మండల కేంద్రంలో 144 సెక్షన్‌‌ విధించి, డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

మక్తల్‌‌లో బీఆర్‌‌ఎస్‌‌ ధర్నా

మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌‌రెడ్డి సహా పలువురు బీఆర్‌‌ఎస్‌‌ నేతల అరెస్ట్‌‌ను నిరసిస్తూ బుధవారం మక్తల్‌‌ పట్టణంలో హైవేపై బుధవారం బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లను అరెస్ట్‌‌ చేసి స్టేషన్‌‌కు తరలించారు. రాస్తారోకోలో మార్కెట్‌‌ కమిటీ మాజీ చైర్మన్‌‌ రాజేశ్‌‌గౌడ్‌‌, మున్సిపల్‌‌ కౌన్సిలర్లు మొగులప్ప, జగ్గలి రాములు, బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు సోంభూపాల్‌‌గౌడ్‌‌, శివారెడ్డి, అన్వర్‌‌ హుస్సేన్‌‌, జుట్ల శంకర్, మహిమూద్‌‌ పాల్గొన్నారు.