మల్యాల, వెలుగు: రైతులపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. శనివారం ఆయన అధికారులతో కలిసి మల్యాల మండలంలోని రాంపూర్ పంపుహౌస్ నుంచి వరదకాలువలోకి నీటిని విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రవిశంకర్ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను రైతులతో కలిసి ఆందోళన చేసేదాకా స్పందించని ఆయన.. ఇప్పుడు నీటిని విడుదల చేయాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు దొంగ ఆనందరెడ్డి, లక్ష్మారెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నేరెళ్ల సతీశ్‌రెడ్డి, ముత్యపు శంకర్‌గౌడ్, తాళ్ల హరినాథ్ పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీల అమలుకే 'ప్రజాపాలన'
గంగాధర, వెలుగు : ఆరు గ్యారంటీల అమలుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రవేశపెట్టిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం తాడిజెర్రి, ఉప్పరమల్యాల, వెంకటాయపల్లిలో శనివారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.