
ఉమ్మడి వరంగల్ లో బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీని వీడగా... వర్థనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం పార్టీని వీడారు. తాజాగా ఆ పార్టీకి మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేష్ బాబు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కొండా దంపతుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయనతో పాటుగా పలువురు కార్యకర్తలు కూడా కాంగ్రెస్ లోచేరనున్నారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ బాబు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ( స్టేషన్ ఘన్ పూర్,జనగామ) జిల్లాలో మాత్రమే గెలిచింది.