
- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
ధర్మసాగర్, వెలుగు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో రాజయ్య పాల్గొని మాట్లాడారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు.
నీ రాజకీయానికి సమాధి చేస్తాం.. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు ప్రభుదాస్, సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షుడు కర్ర సోమిరెడ్డి, మాజీ ఎంపీటీసీ బొడ్డు శోభ, మాజీ వైస్ ఎంపీపీ బండారి రవీందర్, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, నాయకులు బేరి మధుకర్, శేషాల నరేశ్, కుర్సపల్లి ప్రవీణ్ పాల్గొన్నారు.