- సీఎం కేసీఆర్ తప్పిదం వల్లే ఫసల్ బీమా రావడం లేదు
- బాన్సువాడ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి
పోతంగల్(కోటగిరి), వెలుగు: పంట నష్టపోయిన ప్రతిరైతుకు నష్టపరిహారం అందేలా చూస్తామని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. పోతంగల్ మండలంలోని సుంకిని,కొల్లూర్, రామ్‌గంగానగర్, సోంపూర్, టాక్లి, దోమలేడ్గి తదితర గ్రామాల్లో సోమవారం కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు ప్రతీ రైతు వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పంట నష్టపరిహారం అందిస్తామన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్రంలో ప్రతి పంటకూ ఫసల్ బీమా చేయించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు. కేసీఆర్ తప్పిదం వల్లే అకాల వర్షాలకు, కరవుతో పంట నష్టపోయిన రైతులకు బీమా అందడం లేదని విమర్శించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పోతంగల్ మండల అధ్యక్షుడు శంకర్, దోమలేడ్గి ఎంపీటీసీ విఠల్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్, డీసీసీ డెలిగేట్ హన్మంతు, కృష్ణ, రైతులు నాయకులు పాల్గొన్నారు.