రేవంత్‎ను తిడితే BRS నేతల నాలుకలు కోస్తా: జగ్గారెడ్డి

రేవంత్‎ను తిడితే BRS నేతల నాలుకలు కోస్తా: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: అధికారం పోయేసరికి బీఆర్‌‌‌‌ఎస్ నేతలు ఆంధ్రా, తెలంగాణ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్​ఆంధ్రాకు పోయి చేపల పులుసు తిన్నప్పుడు ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్ గుర్తురాలేదా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు, వారికి టికెట్ ఇచ్చినప్పుడు ఆంధ్రా వాళ్లు అనే విషయం గుర్తురాలేదా అని నిలదీశారు. శనివారం మీడియాతో మాట్లాడారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు కల్లుతాగిన కోతుల్లా ప్రవరిస్తున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. 

హరీశ్‌‌రావుకు బుర్ర పనిచేయడం లేదన్నారు. కుటుంబాలకు దూరంగా వినాయక మండపాల వద్ద రాత్రి, పగలు డ్యూటీ చేస్తున్న పోలీసులను అవమానించే విధంగా కేటీఆర్, హరీశ్‌‌రావు మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఫైర్​అయ్యారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కండువా కప్పే సంస్కృతిని కేసీఆరే తీసుకొచ్చారని అన్నారు. 2014 నుంచి 2018 వరకు నలుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలను ఇతర పార్టీల నుంచి బీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేర్చుకున్నారని తెలిపారు. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌‌‌‌కు లేదన్నారు. సీఎం రేవంత్‎ను తిడితే బీఆర్ఎస్ నేతల నాలుకలు కోస్తామని ఘాటు వార్నింగ్ ఇచ్చారు.