
- మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రేవంత్‌పాలన కొనసాగుతున్నదా.. నియంత పాలననా అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం పోయి ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యాంగం వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అరెస్టయిందని చెప్పారు.
ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటికీ కేసులు పెట్టడమా అని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్అరాచకాలను పింక్‌బుక్‌లో రాసుకుంటున్నామని పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్షాడో సీఎం అయితే.. రేవంత్ డమ్మీ సీఎం అయ్యారని విమర్శించారు.