పత్తి కొనుగోళ్లపై విచారణ జరిపించాలి : మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న

పత్తి కొనుగోళ్లపై విచారణ జరిపించాలి : మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్, వెలుగు : సీసీఐ పత్తి కొనుగోళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరుగుతోందని, ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి సమగ్ర విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ ఆఫీస్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ దాదాపు 25 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిందని, కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరగడంతోనే మార్కెట్ సెక్రటరీని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. 

పత్తి కొనుగోలు విషయంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ కనీస శ్రద్ధ చూపలేదని, అధికారులతో ఒక్క రివ్యూ కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. పక్క జిల్లాలు, రాష్ట్రాల నుంచి పత్తిని తీసుకొచ్చి కౌలు రైతుల పేరిట విక్రయించారని, ఇందులో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ, ప్రహ్లాద్, గోవర్ధన్, దమ్మాపాల్, గణేశ్, సతీశ్, గంగయ్య, రమేశ్, శివకుమార్ పాల్గొన్నారు.