భువనగిరి కోటపై ఎర్రజెండా ఎగరేయాలి : జూలకంటి రంగారెడ్డి

గట్టుప్పల, వెలుగు : భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీజేపీని పార్లమెంటు ఎన్నికల్లో ఓడించి, సీపీఎం  అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి భువనగిరి కోటపై ఎర్రజెండా ఎగరవేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం గట్టుపల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల మీటింగులో ఆయన పాల్గొని మాట్లాడారు.

మునుగోడు నియోజకవర్గం వెనుకబాటుకు గత పాలకులే కారణమని, పూటకో పార్టీలు మార్చే నాయకులను చిత్తుగా ఓడించాలని కోరారు. సాగు, తాగునీరు కోసం పోరాటాలు చేసేది కమ్యూనిస్టులేనని చెప్పారు. గతంలోనూ బీజేపీ ప్రభుత్వం రైతులను ధనవంతులను చేస్తానని చెప్పి మోసం చేసిందని ఎద్దేవ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండ శ్రీశైలం, చాపల మారయ్య, ముగుదాల వెంకటేష్, ధనుంజయ గౌడ్, అచ్చిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.