రైతులకు న్యాయం చేయాల : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

 రైతులకు న్యాయం చేయాల : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

నారాయణపేట, వెలుగు: నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్  కింద భూములు కోల్పోతున్న  రైతులకు 2013 చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి  డిమాండ్ చేశారు.  భూ సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఆర్ గార్డెన్‌‌‌‌లో  వెంకట్రామారెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  ప్రభుత్వం ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోతున్న రైతులకు నోటీసులు ఇవ్వకుండానే పోలీసులను పెట్టి భూసేకరణ చేయడం సరైనది కాదన్నారు.  

వెంటనే రైతులతో చర్చించి భుమికి బదులు భూమి ఇవ్వాలన్నారు. 2013 చట్ట ప్రకారం బహిరంగ మార్కెట్ రేట్ కు మూడింతలు కలిపి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్, మాజీ వైస్ ఎంపీపీ మహేశ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య, మచ్చందర్, రాజు, కేశవ్ గౌడ్, నారాయణ, సాయికుమార్, నర్సింలు  గౌడ్, లక్ష్మికాంత్, అరుణ్ తదితరులుపాల్గొన్నారు