యాదాద్రి, వెలుగు: ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కే నగేశ్ కోరారు. ఈ మేరకు సోమవారం సెక్రటేరియట్లో సీఎస్ శాంతికుమారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలేరు చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతమని, జైన, శైవ, వైష్ణవ ఆచారాలకు చెందిన పుణ్యక్షేత్రాలున్నాయని వివరించారు.
యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి టెంపుల్ఆలేరులోనే ఉందని చెప్పారు. రెవెన్యూ డివిజన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని ఎమ్మెల్యే సునీత రెండేండ్ల కిందనే ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు.