రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చౌటుప్పల్ వెలుగు: రాష్ర్ట అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ తన ఉనికి కోల్పోయిందని, ఆ పార్టీ నాయకులు కన్ఫ్యూజ్ కాకుండా కాంగ్రెస్ లో చేరి మద్దతు తెలపాలని కోరారు.

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో భువనగిరి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.. నేడు  జరగబోయే బహిరంగ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

రాజగోపాల్ రెడ్డి సమక్షంలో చేరికలు

చండూరు, వెలుగు: చండూరు మండలం ఇడికూడ, గట్టుప్పల మండలం తేరటుపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఇడికూడలో గిరిగౌడ్, తెరటుపల్లిలో చలమల వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్​లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.