యాదాద్రి భువనగిరి జిల్లా : ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేసి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రం తంగేడు వనం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కుడికాల పాండు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అప్పుడే అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రక్తపు మడుగులో ఉన్న పాండును వెంటనే తన కాన్వాయ్ లో మలక్ పేట్ యశోద ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని రాజగోపాల్ రెడ్డి ఆసుపత్రి వర్గాలను కోరారు.