నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన రాజగోపాల్ రెడ్డి 

మునుగోడు : ఓ నిరుపేద కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థికసాయం చేసి, వారికి అండగా నిలిచారు. మునుగోడు మండలం పులిపల్పల గ్రామానికి చెందిన మునుగోటి సైదులు అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయన ఒక్కగానొక్క కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఓ ప్రైవేటు హాస్పిటల్ లో జాయిన్ చేశారు. పేదరికంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సైదులు పరిస్థితి గురించి తెలుసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. చలించిపోయారు. సైదులు కుమారుడి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించారు. ట్రీట్మెంట్ కి అవసరమైన రూ.2 లక్షల ఆర్థిక సాయం సైదులు కుటుంబానికి అందజేశారు రాజగోపాల్ రెడ్డి.