ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్​ను గెలిపించాలె : కొమ్మూరి ప్రతాప్​రెడ్డి

జనగామ/ బచ్చన్నపేట, వెలుగు: ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్​ పార్టీని గెలిపించాలని జనగామ డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్​రెడ్డి కోరారు. శనివారం జిల్లా కేంద్రమైన జనగామలో భారీ బైక్​ర్యాలీ, రోడ్​షో, బచ్చన్నపేట మండల కేంద్రం, గోపాల్​నగర్​, చిన్నరామచర్ల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.​ ఈ సందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ ప్రజాపాలన అందిస్తున్న సీఎం రేవంత్​ రెడ్డికి అండగా ఉండేందుకు భువనగిరి కాంగ్రెస్​ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కొమ్మూరి ప్రశాంత్​రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి, రాజమౌళి, బచ్చన్నపేట మండలాధ్యక్షుడు నూకల భాస్కర్​రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.