బెజ్జూర్‌ మండలంలో ఉచిత కంప్యూటర్ ​ట్రైనింగ్​ సెంటర్ల ప్రారంభం

 బెజ్జూర్‌ మండలంలో ఉచిత కంప్యూటర్ ​ట్రైనింగ్​ సెంటర్ల ప్రారంభం

కాగజ్ నగర్, వెలుగు: ఆదివాసీ యువతకు స్కిల్ డెవలప్​మెంట్​లో ప్రోత్సాహం అందిస్తామని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బెజ్జూర్‌ మండలంలో రెండు చోట్ల ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ కోచింగ్ సెంటర్లను మంగళవారం కోనప్ప ప్రారంభించారు. 

మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్​లో 4 కంప్యూటర్స్, కుంటలమానేపల్లిలోని ప్రైమరీ స్కూల్ బిల్డింగ్​పై ఉన్న రూములో 4 కంప్యూటర్లతో విద్యార్థులకు, స్థానిక యువకులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శ్రీ చేతన ఫౌండేషన్, శ్రీ ఇన్ఫో సిస్టమ్ సొల్యూషన్స్ సహకారంతో ఉచితంగా కోచింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు అందిస్తామని చెప్పారు.