మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత

మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత

చిన్నచింతకుంట, వెలుగు: అమరచింత, మక్తల్  మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో ఆదివారం ఉదయం హైదరాబాద్  నుంచి స్వగ్రామమైన చిన్నచింతకుంట మండలం పర్కాపూర్ కు తీసుకువచ్చారు. ఇంటి వద్దనే వెంటిలేటర్ పై డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.

పలువురి పరామర్శ..

దయాకర్ రెడ్డి అస్వస్థతకు గురై ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నాగం జనార్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాంమోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, బీజేపీ నేత కొండయ్య, ఆత్మకూరు సంస్థానాధీశుడు శ్రీరాం భూపాల్, డీఎస్పీ కిషన్  తదితరులు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.