చేవెళ్లలో రంజిత్​రెడ్డి ఆటలు సాగవ్ : కేఎస్ రత్నం

చేవెళ్లలో రంజిత్​రెడ్డి ఆటలు సాగవ్ : కేఎస్ రత్నం

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులని, కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డి ఆటలు ఇక్కడ సాగవని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్​కు బినామీ పనులు చేసిన రంజిత్​రెడ్డి కొండా విశ్వేశ్వర్​రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఐదేండ్ల పాలనలో చేవెళ్లకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

శాశ్వతమైన భవనాలు, అభివృద్ధి పనులు ఎక్కడ ఉన్నాయో చూపించాలన్నారు. రంజిత్​రెడ్డి అవినీతి, కుంభకోణాలపై తాము చర్చకు సిద్ధమని సవాల్​ విసిరారు. శుక్రవారం చేవెళ్లలోని బీజేపీ ఆఫీసులో కేఎస్ రత్నం మీడియాతో మాట్లాడారు. ఎవరి ప్రయోజనాల కోసం రంజిత్​రెడ్డి పార్టీ మారారని ప్రశ్నించారు. చేవెళ్ల ప్రజలపై ఆయనకు ప్రేమ లేదని, ఇక్కడి భూములు కాజేసేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాను కబ్జా చేయాలని చూస్తే ఊరుకోబోమని.. గుడ్ల కంపెనీలో ఎంప్లాయ్​గా ఉన్న నీకు ఇన్ని వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేఎస్​రత్నం వెంట నాయకులు ప్రభాకర్​రెడ్డి, వెంకట్​రాంరెడ్డి, అనంతరెడ్డి, రమణారెడ్డి, ఆంజనేయులు, శ్యామ్  ఉన్నారు.