కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి మున్సిపాలిటీలోని ఊరుమందమర్రి ఎస్సీ వాడలోని బోర్వెల్కు అవసరమైన విద్యుత్ మోటార్‌ను మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు శుక్రవారం అందజేశారు. మోటార్ చెడిపోవడంతో వారం రోజులుగా తాగునీటి సౌకర్యం లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న నల్లాల ఓదెలు రూ.18వేల విలువైన కొత్త మోటార్‌ను అందించారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు దుర్గం నరేశ్, ఎండీ ముజాహిద్, ఇబ్రహీం, స్థానికులు పాల్గొన్నారు.