భూనిర్వాసితులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి 

కొండపాక, వెలుగు: సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా భూములు కోల్పోయిన దాదాపు 150 మంది రైతులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. గత ప్రభుత్వంలో భూములు కోల్పోయిన రైతులు,  భూ నిర్వాసితుల సమస్యల పరిష్కరించకుండా వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా పట్టాలు పొందిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు  లింగారావు , శ్రీనివాస్ రెడ్డి , ప్యాక్స్  డైరెక్టర్ సురేందర్ రావు, గంగాధర్, అంజయ్య, నరేందర్, మల్లికార్జున్, చిరంజీవి, సుదర్శన్,  ఐల్లయ్య పాల్గొన్నారు.