
వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మాజీ MLA నేమురుగోమ్ముల సుధాకర్ రావు ఈరోజు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో మృతి చెందారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో చికిత్స తీసుకుంటున్న ఆయన మార్చి 13న తుది శ్వాస విడిచారు. డాక్టర్ వృత్తిలో ఉండే సుధాకర్ వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గానికి టీడీపీ నుంచి గెలిచి1999-- 2004 మధ్య ఎమ్యెల్యేగా ఉన్నారు.
1969లో విద్యార్థిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేసి, జనగామలో అరెస్టు అయ్యారు. ఆయన 2010లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన తల్లిదండ్రులు మాజీ మంత్రి యెతిరాజారావు, తల్లి విమలాదేవి లు చెన్నూరు నుంచి ఎమ్మె్ల్యేలుగా గెలిచారు. 2014లో ఈయనపై టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిచారు. డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్ రావు 2023 ఆగస్టు 14న ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.