
మెదక్, వెలుగు: ఈ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ఆదేశాల మేరకు మంగళవారం జడ్పీ చైర్పర్సన్హేమలత, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి రైతులకు బోనస్, దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని కోరుతూ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మా దేవేందర్ రెడ్డి, సునీతారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా రూ.15 వేలకు పెంపు, బోనస్ వంటి హామీలన్నింటిని గాలికొదిలేసిందన్నారు. కరెంటు సరిగారాక, సాగునీరందక పంటలు ఎండిపోయి రైతులు గోస పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, మున్సిపల్వైస్ చైర్మన్మల్లికార్జున్ గౌడ్, కొల్చారం, చిలప్‌చెడ్ ఎంపీపీలు మంజుల, వినోద, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్జగపతి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్చంద్రగౌడ్, టౌన్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు లింగారెడ్డి, అశోక్ పాల్గొన్నారు.