- లగచర్ల దాడి ఘటనలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఏ-1గా నరేందర్‌రెడ్డి, ఏ-2గా సురేశ్
- నరేందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
- చర్లపల్లి జైలుకు తరలింపు
వికారాబాద్/కొడంగల్, వెలుగు: లగిచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డ కేసులో కొండగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో వాకింగ్ కు వెళ్లిన ఆయనను జిల్లా క్రైం, కొడంగల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి వికారాబాద్‌లోని పోలీస్ ఆఫీసుకు, తర్వాత జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు.
అక్కడ హైదరాబాద్మల్టీ జోన్ -–2 ఐజీ సత్య నారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్ది, పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్ది, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్ది తదితరులు దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు. తర్వాత నరేందర్‌రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి కొండగల్ ప్రభుత్వ దవాఖానకు వైద్య పరీక్షల కోసం తరలించారు. రిమాండ్రిపోర్టులో ఆయనను ఏ1గా చేర్చారు.
కన్ఫెషన్ స్టేట్మెంట్లో తానే సురేశ్‌తో దాడి చేయించానని, ఆర్థికంగా సహకరించారనని నరేందర్‌రెడ్డి ఒప్పుకోవడంతో ఏ1గా ఆయనను చేర్చినట్లు, ఏ2గా సురేశ్‌ను మార్చినట్లు పోలీసులు తెలిపారు. అంతకు ముందు వరకు సురేశ్ పేరు ఏ1గా ఉండేది. బుధవారం సాయంత్రం కొండగల్ ఫస్ట్ క్లాస్మెజిస్ట్రేట్శ్రీరామ్ ఎదుట నరేందర్‌రెడ్డిని హాజరుపరచగా 14 రోజులు జ్యుడీషియల్‌రిమాండ్ విధించారు. దీంతో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.