బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్రెడ్డి

మెదక్:కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మెదక్ జిల్లా పాపన్నపేటలోమంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి  సమక్షంలో బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు శశిధర్ రెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. మెదక్ ప్రాంతంలో పటోళ్ల శశిధర్రెడ్డి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. శశిధర్ రెడ్డి కుటుంబం మెదక్ అభివృద్దికి కృషి చేసిందన్నారు.  ఇటీవల పార్టీలో తిరుపతిరెడ్డి పార్టీలో చేరారు.. ఇవాళ శశిధర్ రెడ్డి చేరికతో మెదక్ లో హ్యాట్రిక్ విజయం ఖాయమైందన్నారు మంత్రి హరీష్ రావు. 

పటోళ్ల శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ..సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ పునరాభివృద్ది లో భాగస్వామిని కావాలనే బీఆర్ఎస్ లో చేరానన్నారు. కాంగ్రెస్ చెవులు మాత్రమే ఉన్నాయి.. కండ్లు లేవన్నారు శశిధర్ రెడ్డి. బీఆర్ ఎస్ తరపున ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తానని శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. 

ALSO READ:  శ్రీశైలం డ్యాం మీదుగా కొత్తగా ఐకానిక్ బ్రిడ్జి