కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో.. సిరిసిల్ల ఖాళీ అవుతది: రఘునందన్ రావు

కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో నుంచి పోయిన తర్వాత కేటీఆర్ కు మతి భ్రమించి ఏదిపడితే అది మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మోదీ గురించి.. అధికారంలో నుంచి పోయిన తర్వాత గవర్నర్ గురించి నోటికి ఎంతస్తే అంత మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేటీఆర్  నోరు అదుపులో పెట్టుకో.. సిరిసిల్ల ఖాళీ అవుతుంది నీకు కనిపిస్తలేదా అని ప్రశ్నించారు రఘునందన్ రావు అన్నారు. జెడ్పిటీసీలు, సర్పంచ్ లు, ఎంపిటీసీలు, నాయకులంతా రాజీనామా చేశారు.. 5 సంవత్సరాల తర్వాత చూసుకుంటే.. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతదన్నారు. 

కాంగ్రెస్, బీజేపీ ఒకటని కేటీఆర్ మాట్లాడుతున్నారని.. ఏది ఏమైనా కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావని చెప్పారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక నాణ్యానికి బొమ్మా బొరుసులాగా ప్రవర్తిస్తున్నాయని రఘునందన్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాక ఈ బేరసాలాలు ఇలాగే కొనసాగించుకుని.. ఎన్నికల్లో లబ్ధి పొందటానికని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది మాటలుగా ఉన్నాయి.. చేతలు మాత్రం కనిపిస్తలేవని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్న వారిపై వెంటనే రియాక్షన్ తీసుకోవాలని చెప్పారు.. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. ఇప్పటివరకు ఎవరిపై మీరు యాక్షన్ తీసుకోలేదని.. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు రఘునందన్ రావు. తెలంగాణలో పదేళ్లు జరిగిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్వేతపత్రం ఇచ్చి.. అసెంబ్లీలో ఎవరు దోషులో చెప్పడానికి మీకు దైర్యం ఉందా.. లేదా.. అని నిలదీశారు.