మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్​కు పితృవియోగం 

దేవరకొండ, వెలుగు : దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ తండ్రి కనీలాల్(70) హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన హైదరాబాద్​లోని నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి కనీలాల్(70) మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కనీలాల్ అంత్యక్రియలు ఆదివారం తన సొంత గ్రామం రత్యతండాలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.