కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేం : సుంకె రవిశంకర్

గంగాధర, వెలుగు : కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేమని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కంటతడి పెట్టారు. తాను ప్రజాతీర్పును గౌరవిస్తానని, మంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల పై పోరాటం చేస్తానని  ప్రకటించారు. గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసంలో సోమవారం ఆయన ప్రెస్​మీట్​ నిర్వహించారు.

ఈ సందర్భంగా రవిశంకర్​  మాట్లాడుతూ తాను నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. 2018లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్​కుమార్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు.  

ALSO READ :- కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక ఖరారు.. సాయంత్రం పేరు వెల్లడించే చాన్స్

ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉన్నానని,  ఇకపై  కూడా అందుబాటులో ఉంటానన్నారు. తనకోసం కష్టపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆరు మండలాల నాయకులు పాల్గొన్నారు.